నోట్ల రద్దు వెనక అసలు ఉద్దేశం అదికాదన్న జైట్లీ

13:20 - November 8, 2018

న్యూఢిల్లీ: నోట్ల రద్దుకు రెండేళ్లు నిండింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నోట్ల రద్దు అసలు ఉద్దేశాన్ని విశదీకరించారు. డీమానిటైజేషన్ అదే పెద్ద నోట్ల రద్దు అసలు ఉద్దేశం నగదును సీజ్ చేయటం కాదు.. ఎక్కువ నగదు కలిగిఉన్న వారిచేత పన్ను చెల్లించేవిధంగా చేయడమేనని ఆర్థికమంత్రి వివరణ ఇచ్చారు. ‘‘లెక్కలోలేని నగదును ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంతోపాటు.. వారిచేత పన్ను చెల్లింపచేయడమే ప్రధాన ఉద్దేశం. అయితే దేశంలో నగదు వినియోగాన్ని తగ్గించి.. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను పెంచే విధానం అవసరం దేశానికి ఉంది’’ అంటూ గురువారం జైట్లీ వివరించారు. 

Image result for old indian currency notes
డీమానిటైజేషన్ తర్వాత యూపీఐ యాప్ విడుదలచేయడం ద్వారా ఢిజిటల్ లావాదేవీల్లో భారీ మార్పులు వచ్చాయి. ఇంతకుముందు కేవలం 50 లక్షల లావాదేవీలు అక్టోబర్ 2016 సంవత్సరం జరగగా..వీటి సంఖ్య సెప్టెంబర్, 2018 నాటికి 598 లక్షలకు చేరింది.   అలాగే డీమానిటైజైషన్ తర్వాత భీమ్ లావాదేవీలు కూడా భారీగా పెరిగాయి. 
 

 

Don't Miss