మార్కెట్లోకి పతంజలి జీన్స్ విడుదల చేసిన బాబా రాందేవ్

18:50 - November 5, 2018

ఢిల్లీ: యోగా గురువు బాబా రాందేవ్ యోగా పాఠాలతో మొదలు పెట్టి, పతంజలి బ్రాండ్ నేమ్ తో వినియోగదారుల మార్కట్ లోకి ప్రవేశించి స్వదేశీ నినాదంతో నిత్యావసర సరుకులు, ఆహార,ఆరోగ్య ఉత్పత్తులు, అమ్మకం మొదలు పెట్టారు. పతంజలి గతంలో ప్రకటించినట్లే ఈరోజు దుస్తుల ఉత్పత్తులను కూడా మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ఢిల్లీలో పతంజలి పరిధాన్  పేరుతో మొదటి ఫ్యాషన్ స్టోర్ ను బాబా రాందేవ్ సోమవారం  ప్రారంభించారు. 2020 నాటికి దేశవ్యాప్తంగా 200 పతంజలి పరిధాన్ స్టోర్ లు  ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు.విదేశీ బ్రాండ్లకు అలవాటుపడిన మన ప్రజలకు స్వదేశీ ఉత్పత్తులను అందించాలనే ఉద్దేశంతోనే పతంజలి దుస్తుల రంగంలోకి అడుగుపెట్టిందని బాబా రాందేవ్ తెలిపారు. తమ స్టోర్‌లో వివిధ రకాలైన ఉత్పత్తులను అందిస్తున్నట్లు తెలిపారు. స్వదేశీ ఉత్పత్తులను అందించడం అనేది కొత్త ఉద్యమమని అన్నారు.
500 రూపాయలకే పతంజలి స్టోర్స్ లో  సంస్కార్ జీన్స్ అందిస్తున్నారు. కేవలం యువతకే కాకుండా పురుషులకు,మహిళలకు, చిన్న పిల్లలకు కావల్సిన అన్ని దుస్తులు  పంతజలి పరిధాన్ లభిస్తాయని సంస్ధ తెలిపింది. దీపావళి సందర్భంగా 5 రోజుల పాటు దుస్తులపై ఆఫర్లుకూడా ప్రకటించారు. ఆస్ధా, సంస్కార్,లైవ్ ఫిట్ అనే బ్రాండ్లతో 3500 వేరియంట్లలో వస్త్రాలను  ఉంచింది. హోం. టెక్స్ టైల్స్, షూలు, ఆభరణాలు,  ఇతర వస్తువులు కూడా  ఈ స్టోర్స్ లో లభ్యంఅవుతాయని బాబా రాందేవ్ ట్వీట్ చేశారు. 7వేల రూపాయలు విలువైన  1జీన్స్ ప్యాంట్,2 టీ షర్టులు  రూ.1100 కే ఇస్తున్నట్లు రాందేవ్ చెప్పారు.

Don't Miss