ఫోన్ మెమరీ లాస్ కాకుండా జాగ్రత్త పడండి

11:34 - October 30, 2018

ఢిల్లీ: సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు కొత్త ఫీచర్స్ అప్ డేట్ చేస్తూ వస్తోంది.  Media Visibility అనే ఈ కొత్త ఫీచర్ ద్వారా ఫోన్ మెమరీ స్టోరేజ్ వేస్ట్ కాకుండా ఉంటుంది. 
స్మార్ట్ ఫోన్ యూజర్లు ఉద్యోగ,వ్యాపార రీత్యా అనేక గ్రూప్ లలో  సభ్యులుగా ఉంటుంటారు. కొన్నిసార్లు ఒకే పోస్టు అన్నిగ్రూప్ ల్లోను చక్కర్లు  కొడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ పోస్టుకు సంబంధించిన వీడియోనో, ఫోటోనో, అన్ని గ్రూప్ల్లో డౌన్లోడ్ అయ్యి డేటా లాస్ అవుతూ ఉంటుంది. తద్వారా ఫోన్ మెమరీ కూడా నిండి పోతూ ఉంటుంది. అవసరమైన వాటినే డౌన్ లోడు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ చాలామంది అన్ని ఫీచర్లు ఉపయోగించుకోలేక పోవటం వల్ల ఇలాంటి ఇబ్బంది తలెత్తుతుంది. మనకు అక్కర్లేని  ఫోటోలు,వీడియోలు గ్యాలరీలోంచి ఎప్పటికప్పుడు డిలిట్ చేసుకోకపోవటం వల్ల త్వరగా ఫోన్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది. దాంతో గ్రూప్ ఎడ్మిన్ మీద, పోస్టు పంపించిన వారిమీద చిరాకుపడుతూ ఉంటారు. లేదా గ్రూప్ ల్లోంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు.
ఇకనుంచి అలాంటి బాధ లేకుండా వాట్సప్  ఇప్పుడు కొత్త ఫీచర్  అందుబాటులోకి తీసుకు వచ్చింది. దానికి మీరు ఏం చెయ్యాలంటే ...ముందుగా మీరు ఉన్న గ్రూప్ ఓపెన్  చేసి, రైట్ సైడ్ టాప్ లో ఉన్న 3 చుక్కలను తాకి, Group Info ఓపెన్  చేయండి.  అప్పుడు మీకు స్క్రీన్ మీద Media Visibility అనే కొత్త ఆప్షన్  కనపడుతుంది. అందులో No అని సెట్ చేసి OK  చేస్తే  వాట్సప్ లో వచ్చిన  ఫోటోలు, వీడియోలు మీకు కనపడతాయి కానీ, మెమరీ లోకి రావు. ఈ ఆప్షన్ ప్రస్తుతం గ్రూప్ లకు మాత్రమే ఉంది. అలాగే ఏ గ్రూప్ కి ఆగ్రూప్ కి ఈ ఆప్షన్ సెట్ చేసుకోవాలి. 

Don't Miss