కదులుతున్న కారులో మంటలు .. డ్రైవర్ సురక్షితం

14:35 - November 9, 2018

గుర్‌గావ్: ఓ కారు మంటల్లో చిక్కుకుంది..అయినా ఆగలేదు. మంటల్లోనే కదులుతున్న కారులోంచి దూకి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడుకున్న సంఘటన ఢిల్లీ దగ్గరలోని గుర్‌గావ్‌లో చోటుచేసుకుంది. మంటలతో కారు స్పీడుగా పోతుంటే అటుగా వెళుతున్న ఓ వ్యక్తి దాన్ని చిత్రీకరించాడు. చూపరులను భయభ్రాంతులకు గురిచేసే ఈ సంఘటన వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. రాకేష్ చందల్ అనే వ్యక్తి దీపావళి బహుమతులను స్నేహితులకు పంచుకుంటూ కారులో ప్రయాణిస్తుండగా ఉన్నట్టుండి ఏదో పెద్ద శబ్దం వినిపించింది. ఏంటో చూద్దామని కారు దిగినా ఏమీ లేకపోవడంతో మళ్లీ కారు స్టార్ట్ చేసి సైబర్ సిటీ ప్లైఓవర్ మీద పోతుండగా మంటలు కనిపించాయి. బ్రేక్ వేసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో ఒక్కసారిగా సీటులోంచి జంప్ చేసి రోడ్డుమీదకు దూకి ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాడు. మంటలు ఒక్కసారిగా పెరిగి కారు వెనకాలే తనుకూడా పరిగెత్తడం వీడియోలో రికార్డు అయ్యింది. 

Don't Miss