ఎనర్జీ డ్రింక్స్‌తో పిల్లలకు ముప్పే!

13:02 - September 20, 2018

వాషింగ్‌టన్: ఎనర్జీ డ్రింక్స్ పేరుతో మార్కెట్‌లో దొరుకుతున్న వాటితో ఎదుగుతున్న పిల్లలకు పెద్ద ముప్పే పొంచిఉందని ఇటీవల చేసిన పరిశోధనలో వెల్లడయ్యింది. ఈ డ్రింక్‌లలో ఉండే కాఫీన్‌తో పిల్లల్లో అధిక బరువు మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.  ఇప్పటికే అధిక ఆదాయవర్గాల పిల్లలు మోతాదుకు మించి షుగర్‌తో కూడిన ఆహార పదార్ధాలను వినియోగిస్తున్నారు. కాబట్టి వారికి అధిక ఎనర్జీ అవసరం లేదని వారు అంటున్నారు. వీటి మూలంగా నిత్యం మన ఆహారంలో లభించే కాఫీన్ కన్నాఎక్కువ మోతాదులో వినియోగం పెరిగి నష్టం చేకూర్చే ప్రమాదం పొంచి ఉందని రస్సెల్ వైనర్ అనే పరిశోధకుడు హెచ్చరిస్తున్నారు.  

2014 సంవత్సరంలో 5 వేల మంది పిల్లలను పరిశీలించగా.. అందులో 11-15 వయస్సు ఉన్నావారు 14 శాతం మంది వారానికి 3-4 సార్లు ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారని.. 5 శాతం మంది ప్రతీ రోజు వీటిన తాగుతున్నారని తేలింది.

కాఫీన్ మోతాదు పెరిగితో పిల్లల్లో ఆందోళన పెరగటంతో పాటు, నిద్ర సమయం తగ్గటం..అలాగే ప్రవర్తన సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని ఈ పరిశోధన ఫలితాలు హెచ్చరిస్తున్నాయి.

Don't Miss