రాజ్యాంగబద్ధ సంస్థలను నాశనం చేసిన బీజేపీ : చంద్రబాబు

15:46 - December 5, 2018

సూర్యపేట : టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీ, టీఆర్ఎస్ లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండు పార్టీల విధానాలను ఎండగట్టారు. రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ నాశనం చేసిందని మండిపడ్డారు. నోట్ల రద్దు, జీఎస్టీతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. మోడీ అందరిపై దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా బలం లేని పార్టీ బీజేపీ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని కేసీఆర్, దేశాన్ని మోడీ నాశనం చేస్తున్నారని విమర్శించారు. దేశాన్ని కాపాడుకునేందుకే కాంగ్రెస్ తో కలిశామని తెలిపారు. కోదాడలో నిర్వహించిన ప్రజా కూటమి బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని, మాట్లాడారు. 
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు...
కేసీఆర్ తనను ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎంఐఎం, బీజేపీతో కేసీఆర్ స్నేహం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ను ఓడించాలని పిలుపు ఇచ్చారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసి ఓఆర్ఆర్, హైటెక్ సిటీ కట్టామని తెలిపారు. దేశంలో రెండే కూటములున్నాయని..టీఆర్ఎస్, ఎంఐఎం ఎవరికి మద్దతు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ప్రజల కోసం పని చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని విమర్శించారు. రేవంత్ ను అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. ప్రజల కోసమే తెలంగాణకు వచ్చానని తెలిపారు. ఈవీఎంలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. 

 

Don't Miss