సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం

18:56 - November 19, 2018

సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్, నివేదా పేతురాజ్, కళ్యాణి ప్రియదర్శిని హీరో, హీరోయిన్లుగా, కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న మూవీ, చిత్ర లహరి. ఈరోజు నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. షూటింగ్ స్పాట్‌లో తీసిన ఫోటోని తేజు ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు. డైరెక్టర్.. సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే, తేజు, నివేదా అండ్ కళ్యాణి శ్రద్ధగా వింటున్నారు ఆ ఫోటోలో. గెడ్డం పెంచి సరికొత్త లుక్‌లోకి మారిపోయాడు తేజ్. చిత్ర, లహరి, అనేవి హీరోయిన్ల పేర్లట. వారి పేర్లతో టైటిల్ పెట్టడం విశేషం.. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. తేజ్ ఐ లవ్ యూ తర్వాత తేజ్ చేస్తున్న సినిమా ఇదే. ఈ సినిమా హిట్ కొట్టడం టీమ్ అందరికీ తప్పనిసరిగా మారింది. గత కొంతకాలంగా వరస ఫ్లాప్‌లతో సతమతమవుతున్నాడు తేజ్.. ఈ సినిమా ద్వారా ఖచ్చితంగా హిట్ కొడితేనే తన ఉనికిని కాపాడుకోగలడు. అలాగే దర్శకుడు కిషోర్, బిఫోర్ మూవీ, ఉన్నది ఒకటే జిందగీ ఝలక్ ఇచ్చింది. మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయింది, నివేదా పేతురాజ్.. రీసెంట్‌గా డబ్బింగ్ మూవీ రోషగాడుతో ఆడియన్స్‌ని అలరించింది. తనకి తెలుగులో  సరైన బ్రేక్ రావాలంటే, ఈ సినిమా హిట్ కావాలి.. హలోతో ఇంట్రడ్యూస్ అయిన కళ్యాణి ప్రియదర్శన్‌ది కూడా ఇదే పరిస్ధితి.. వరసగా మూడు సూపర్ హిట్స్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్‌కి, ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు, ఒకే నెలలో, సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటొని రూపంలో రెండు గట్టి దెబ్బలు తగిలాయి.. కాబట్టి, వీళ్ళందరికీ చిత్ర లహరి హిట్ కొట్టడం చాలా అవసరం.  

Don't Miss