శేషాచల అడవుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసుల కూంబింగ్

12:50 - September 29, 2018

చిత్తూరు : శేషాచల అడవుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. కాపుకాసి ఉన్న పోలీసులకు చంద్రగిరి మండలం నారావారిపల్లి వద్ద స్మగ్లర్లు కారు ఎదురు పడింది. ఆ వాహనాన్ని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వెంబడించింది. నారావారిపల్లి నుంచి భయ్యారెడ్డిపల్లి వరకు 20 నుంచి 25 కిలీ మీటర్ల మేర సినీ ఫక్కిలో పోలీసులు చేజింగ్ చేశారు. అయితే తప్పని పరిస్థతిలో స్మగ్లర్లు భయ్యారెడ్డిపల్లి వద్ద కారును గుంతలోకి దించి, డ్రైవర్‌తోసహా పరారయ్యారు. 13 ఎర్రచందనం దుంగలు, వాహనాన్నిస్వాధీనం చేసుకున్నారు. చేజింగ్ సమయంలో ముగ్గురు కానిస్టేబుల్స్‌కు గాయాలయ్యాయి. స్మగ్లర్లు దగ్గరలోని అటవీప్రాంతంలోకి పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

 

Don't Miss