సీపీఐకి 5 సీట్లు ఇచ్చి తీరాల్సిందే : పల్లా వెంకటరెడ్డి

08:23 - November 5, 2018

హైదరాబాద్ : మహాకూటమిలో సీపీఐకి 5 సీట్లు ఇచ్చి తీరాల్సిందేనని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ ఆలస్యం చేస్తోందని చెప్పారు. కాంగ్రెస్‌ నాన్చుడు ధోరణి అవలంబించడం కొంత నిరాశకు గురిచేసిందన్నారు. కూటమి నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోయే పరిస్ధితి లేదని స్పష్టం చేశారు. 

 

Don't Miss