డిసెంబర్ 7న కేంద్రప్రభుత్వ కార్యాలయాలకు సెలవు..

20:43 - December 5, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికలు డిసెంబర్ 7న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఈనెల 7వ తేదీన సెలవు ప్రకటిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే 7వ తేదీన సెలవు ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈనెల 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.  

 

Don't Miss