రజనీకాంత్ సినిమా 2.ఓ పాకిస్థాన్‌లో విడుదలకు లైన్ క్లియర్

16:38 - November 28, 2018

లాహోర్ : శంకర్ దర్శకత్వం వహిస్తున్న రాజనీకాంత్ - అక్షయ్ కుమార్ నటిస్తున్న 2.ఓ చిత్రం పాకిస్థాన్‌లో విడుదల చేసేందుకు కావాల్సిన అన్ని అనుమతులు పొందింది. పాకిస్థాన్ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సెన్సార్ (సీబీఎఫ్సీ) 2.ఓ సినిమాను దేశ వ్యాప్తంగా విడుదల చేసేందుకు అనుమతిని మంజూరు చేసింది. అలాగే పంజాబ్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు (పీఎఫ్‌సీబీ) కూడా అనుమతులు జారీచేసింది. ఎటువంటి కట్‌లు లేకుండా పంపిణీదారులు 2.ఓ సినిమాను విడుదలచేయొచ్చని బోర్డు సభ్యులు హామీ ఇచ్చారు. 
2.ఓ సినిమా నవంబరు 30 పాకిస్థాన్‌లో విడుదలచేయాలని నిర్మాతలు నిర్ణయించారు. దేశం మొత్తంమీద 75 స్క్రీన్లలో సినిమా ప్రదర్శితమవుతుంది. ఈ సినిమా కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్ ఇతర మెట్రో నగరాల్లో భారీ వసూళ్లు కురిపిస్తుందని భావిస్తున్నట్టు  సినిమా డిస్ట్రిబ్యూషన్ క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. 2.ఓ సినిమా అత్యున్నత స్పెషల్ ఎఫక్ట్స్‌తో, కెమేరా పనితనం  హాలీవుడ్ స్థాయిలో ఉందని.. ఇందుకోసం మొట్టమొదటి సారిగా 3డీ టెక్నాలజీని ఉపయోగించారని.. భారతీయ సినిమాల్లోనే ఇది ఆణిముత్యంగా నిలుస్తుందని పాకిస్థాన్ సినిమా పంపిణీదారులు చెబుతున్నారు.
 

 

Don't Miss