విశాఖ భూ కుంభకోణంలో ధర్మాన : సిట్

21:13 - November 6, 2018

విశాఖపట్నం: విశాఖలో జరిగిన భూరికార్డుల ట్యాంపరింగ్ పై సిట్ అధికారులు విచారణ జరిపి కేబినెట్ కు నివేదిక ఇచ్చారు. నివేదికలో మాజీ మంత్రి ధర్మాన పేరు కూడా ఉంది.  విశాఖ జిల్లాలో గత 15 ఏళ్లుగా జరిగిన భూలావాదేవీలపై విచారణ జరిపి ఇచ్చిన సిట్ నివేదికలో ధర్మానతో సహా ముగ్గురు కలెక్టర్లు, నలుగురు జాయింట్ కలెక్టర్లు పేర్లు ఉన్నాయి. వీరు కాక కిందిస్ధాయి సిబ్బందిలో 14మంది ఆర్డీవోలు,10 మంది డీఆర్వోలు కూడా ఉన్నారు. మొత్తంగా 100 మంది అధికారులపై శాఖాపరమైన క్రిమినల్  చర్యలు తీసుకోవాలని సిట్ తన నివేదికలో తెలిపింది. మాజీ సైనికుల పేరుతో జరిగిన భూముల కుంభకోణంపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.  సిట్ నివేదిక అనంతరం ,అప్పటి ఎన్వోసీలు రద్దు చేసేందుకు ప్రభుత్వం రంగం సిధ్దం చేస్తోంది. కొన్ని భూముల రిజిష్ట్రేషన్లు రద్దు చేయాలని కూడా సిట్ సూచించింది. భూ కుంభకోణంలో మంత్రి గంటాకుసంబంధంలేదని  సిట్ తేల్చింది. సిట్ నివేదికపై తదుపరి చర్యలకోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

Don't Miss