ఇవాళ తిత్లీ తుపాను బాధితులకు చెక్కుల పంపిణీ

09:27 - November 5, 2018

శ్రీకాకుళం : తిత్లీ తుపాన్‌ బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ చెక్కులు పంపిణీ చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో చెక్కుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయం, మత్స్యకారులు, ఇల్లు కోల్పోయినవారు.. ఇలా బాధితులందరికీ మొత్తం 540 కోట్ల రూపాయలు పరిహారం అందించనున్నారు. పలాస మున్సిపాలిటీ పరిధిలోని జూనియర్‌ కళాశాల గ్రౌండ్స్‌లో చంద్రబాబు కొంతమందికి చెక్కులు అందిస్తారు. అలాగే జిల్లాలోని అన్ని పంచాయితీల్లో అధికారులు చెక్కులు అందిస్తారు. మధ్యాహ్నం పలాసకు చేరుకోనున్న చంద్రబాబు... చెక్కుల పంపిణీ అనంతరం.. బహిరంగ సభలో పాల్గొంటారు. 

 

Don't Miss