మావోయిస్టుల కాల్పుల్లో డీడీ న్యూస్ కెమెరామెన్ మృతి... సెల్ఫీ వీడియో

13:51 - October 31, 2018

ఛత్తీస్‌గడ్ : మావోయిస్టుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన డీడీ న్యూస్ కెమెరామెన్ అచ్యుతానంద్ సాహూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తనను కాపాడాలంటూ అచ్యుతానంద్ సాహూ తీసిన సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాల్పుల సమయంలో తనకు బతకాలనుందని..కాపాడాలంటూ సెల్ఫీ వీడియో తీశాడు.

ఛత్తీస్‌గడ్‌లోని దంతేవాడ జిల్లా ఆరాన్పూర్‌లో ఎన్నికల ప్రచారవార్తలు కవర్ చేయటానికి వెళ్లిన దూరదర్శన్ మీడియా సిబ్బందిపై నిన్న మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. ఈఘటనలో డీడీ న్యూస్ కెమెరామెన్ అచ్యుతానంద్ సాహూతోపాటు ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. 

 

Don't Miss