రాజస్థాన్ లో ముగిసిన ఎన్నికల ప్రచారం...

21:05 - December 5, 2018

జైపూర్ : రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకులు కట్ అయ్యాయి. నోటికి తాళం పడింది. ప్రచార రథాలకు బ్రేక్ పడింది. డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం సరిగ్గా 5 గంటలకు రాజకీయ పార్టీలు ప్రచారం ముగించాయి. సభలు, సమావేశాలు, రోడ్డు షోల్లో ఉన్న నేతలు ఎక్కడి వారు అక్కడ గప్ చుప్ అయ్యారు. ప్రెస్ మీట్లలోని నేతలు టైం చూసుకుని మరీ మాట్లాడారు. 5 గంటలు కాగానే నోటికి తాళం వేశారు. ప్రసంగాలు ఆగిపోయాయి. 
ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు పూర్తి..
డిసెంబర్ 7న పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలోని 200 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 4 కోట్ల 74 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 51 వేల 796 పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేశారు. 

 

Don't Miss