అభిమానులను ఆకట్టుకుంటున్న విక్రమ్ న్యూలుక్

18:02 - November 6, 2018

చియాన్ విక్రమ్.. వయసుతో సంబంధం లేకుండా, క్యారెక్టర్ కోసం ఒళ్ళు హూనం చేసుకుంటాడు. ప్రతీ సినిమాలోనూ తన పాత్ర  వైవిధ్య భరితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇక కమల్ హాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం ట్రైచేసే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా రూపొందితే ఎలా ఉంటుంది. బొమ్మ అదుర్స్ కదూ.. ఇంతకీ కమల్, విక్రమ్ కలిసి చేస్తున్న సినిమా సంగతులేంటంటే, రాజేష్ ఎమ్ సెల్వ డైరెక్షన్‌లో, రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై, కమల్ హాసన్ సమర్పణలో, ట్రిడెంట్ ఆర్ట్స్ భాగస్వామ్యంలో, కాదరం కొండన్ అనే మూవీ రూపొందుతుంది. విక్రమ్‌కిది 56వ సినిమా. దీపావళి సందర్భంగా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసారు. ఎప్పటిలానే చియాన్ చింపేసాడు. పోస్టర్‌లో, విక్రమ్ రెండు చేతులకు బేడీలు వేసున్నాయి, స్టైల్‌గా గాగుల్స్ పెట్టుకుని, అంతే స్టైల్‌గా నోట్లోనుండి పొగ వదులుతున్నాడు. చేతిపైన, జబ్బలపైనా పెద్ద పెద్ద టాటూలతో పిచ్చెక్కించాడు. ఈ లుక్, విక్రమ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి గిబ్రాన్ సంగీతమందిస్తున్నాడు. 

Don't Miss