విమాన పైలట్ ఢిల్లీకి చెందిన భవ్యసునేజా

14:32 - October 29, 2018

ఢిల్లీ: ఇండోనేషియాలోని జకార్తాలో సోమవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో, విమానం నడిపిన పైలట్ ఢిల్లీకి చెందిన భవ్య సునేజా అనే 31 ఏళ్ల వ్యక్తి. లయన్ఎయిర్ వేస్ లో మార్చి 2011 నుంచి పనిచేస్తున్న సునేజా కేరీర్ లో ఎటువంటి రిమార్క్స్ లేవని లయన్ ఎయిర్ అధికారులుతెలిపారు. గత జులైలో ఢిల్లీకి బదిలీ చేయమని అడిగాడని, ఏడాది తర్వాత పోస్టింగ్ ఇస్తామని చెప్పినట్లు లయన్ ఎయిర్ వేస్ అధికారులు తెలిపారు.  సునేజా ఢిల్లీలో విద్యాభ్యాసం పూర్తి చేసారు. అతని కుటుంబ సభ్యులు ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో నివసిస్తున్నారు. సునేజా అనుభవంరీత్యా తనసర్వీసులో ఎక్కువగా బోయింగ్737 విమానాలనే నడిపారు. ప్రమాదానికి సరిగ్గా కొద్ది క్షణాల ముందు విమానం వెనక్కి తిరిగి వచ్చేందుకు అనుమతి అడిగినట్లు  తెలుస్తోంది. ఆతర్వాత కొద్దిసేపటికే రాడార్‌తో సంబంధాలు తెగిపోవడం.... 188 మంది ప్రయాణికులు గల్లంతవ్వడం జరిగిపోయింది. లయన్ ఎయిర్‌కి చెందిన జేటీ610 విమానం రాజధాని జకర్తా నుంచి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:20కు బయల్దేరింది. అనంతరం 13 నిమిషాలకు అంటే సరిగ్గా 6:33కి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో సంబంధాలు తెగిపోయాయి.విమానంలో  మొత్తం 178 ప్రయాణికులు, ఓ చిన్నారి, ఇద్దరు పసికందులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్టు ఇండోనేషియా పౌర విమానాయాన శాఖ డైరెక్టర్ జనరల్ సిందు రహయు ప్రకటించారు. 

Don't Miss