దొంగతనానికి వచ్చి బాలికపై గ్యాంగ్ రేప్...

13:40 - November 2, 2018

భువనేశ్వర్ : ఒడిశాలో దారుణం జరిగింది. దొంగతనానికి వచ్చి దుండగులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దొరికిన సొమ్మును ఎత్తుకుపోవటంతోపాటు బాలిక పైనా పైశాచిత్వాన్ని ప్రదర్శించారు. ఈ దారుణ ఘటన కలకలం రేపింది. 

ఒడిశాలోని గంజాం జిల్లా కవిసూర్యనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధి దొయికొన గ్రామంలోని ఓ ఇంట్లోకి ముగ్గురు దుండగులు బుధవారం అర్ధరాత్రి చోరి చేసేందుకు వెళ్లారు. దొరికిన సొమ్మును ఎత్తుకుపోవటంతోపాటు ఇంట్లో అమ్మ పక్కన నిదురిస్తున్న తొమ్మిదేళ్ల బాలికను అపహరించి, సామూహిక అత్యాచారానికి చేశారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులంతా ఒకేచోట పడుకుని ఉన్నారు. గురువారం తెల్లవారుజామున మేల్కొన్న బాలిక తల్లి.. కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళన చెంది.. భర్తను నిద్ర లేపింది. అప్పటికే ఇంట్లోని సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉంది. అల్మారాలో దాచిన రూ.20వేల నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు దంపతులు గుర్తించారు. దొంగతనానికి వచ్చినవారే తమ కుమార్తెనూ ఎత్తుకుపోయి ఉంటారని అనుమానించి, ఇరుగుపొరుగు సాయంతో బాలిక కోసం గాలిస్తుండగా బాధితురాలు ఏడుస్తూ వచ్చింది. ముసుగులు ధరించిన ముగ్గురు యువకులు తనను ఎత్తుకుని గడ్డివాము చాటుకు తీసుకెళ్తుండగా, మెలకువ వచ్చిందని బాలిక పేర్కొంది. అరిస్తే చంపేస్తామని బెదిరించి దుండగులు అత్యాచారం చేశారని బాధితురాలు పేర్కొన్నట్టు అమె తండ్రి తెలిపారు.

Don't Miss