పక్షిరాజా రావాల్సిందే! : 5G టెస్ట్ సిగ్నల్‌కు పక్షులు బలి

15:12 - December 3, 2018

2.ఓ సినిమాలో పక్షిరాజా గుర్తున్నాడుగా.. పక్షిరాజాగా అక్షయ్ కుమార్ చేసిన పాత్ర సినిమాకే హైలైట్‌. పక్షులను చంపేస్తున్న సెల్‌ఫోన్ టవర్స్‌ను నాశనం చేయటమే కాకుండా సెల్‌ఫోన్లను మాయం చేస్తుంటాడు ఈ పక్షిరాజా. మనిషి చేసే తప్పు ప్రకృతికి ఎలా శాపం అవుతుందో.. పక్షిరాజా పోరాటం చెబుతోంది. సెల్‌ఫోన్ రేడియేషన్ వల్ల ఇప్పటికే పిచ్చుకలు అంతరించిపోయాయి. కేవలం 4G టెక్నాలజీ వల్లే ఇంత వినాశనం జరిగితే.. రాబోయే 5G సిగ్నల్ రేడియేషన్ ఎంత ముప్పు తీసుకురాబోతున్నది అనేది అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆందోళనను నిజం చేస్తూ.. నెదర్లాండ్‌లో జరిగిన ఓ ఘటన అందరి వెన్నులో వణుకుపుట్టిస్తోంది.
నెదర్లాండ్స్‌లో 5G రేడియేషన్ టెస్ట్ సిగ్నల్ :
నెదర్లాండ్స్ రాజధాని హేగ్‌లోని ఓ పార్క్‌లో కొంతకాలంగా పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఆ పార్క్ పరిధిలో 300 పక్షులు చనిపోయి ఉన్నాయి. వరసగా పక్షులు చనిపోతుండటంతో ఆందోళన చెందిన పక్షి ప్రేమికులు కారణాలపై అన్వేషించారు. షాకింగ్ విషయం తెలిసింది. 5G టెస్ట్ సిగ్నల్‌ రేడియేషన్ అని తెలిసి వణికిపోయారు. 5G టెస్ట్ సిగ్నల్‌ వల్లే వందలాది పక్షులు చనిపోయినట్లు పశు వైద్యులు వెల్లడించారు. టెలికాం కంపెనీ అధికారులు కూడా అంగీకరించారు. 5G టెస్ట్ సిగ్నల్ చేశామని.. రేడియేషన్ బాగా వచ్చిందని మాత్రమే చెబుతున్నారు వారు. 
రేడియేషన్ దెబ్బకి పక్షులు విలవిల:
డచ్ రైల్వే స్టేషన్‌కు అనుసంధానంగా అధికారులు 5G టెస్ట్ సిగ్నల్ ప్రయోగం చేశారు. దీని కారణంగా రేడియేషన్ చుట్టుపక్కల ఉన్న పక్షులపై తీవ్ర ప్రభావం చూపింది. రేడియేషన్ కారణంగా పక్షులు చనిపోతున్నాయి. కొన్ని పక్షులు రేడియేషన్ బారి నుంచి తప్పించుకునేందుకు నీళ్లలో తలదాచుకుంటున్నాయి. ఈ ఘటనపై పక్షి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రయోగాలు చేయడం ఏంటని నిలదీస్తున్నారు. పక్షులను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరేమో 2.ఓ సినిమాలో చూపించినట్టుగా.. నిజ జీవితంలోనూ పక్షిరాజా రావాల్సిందేనని, అప్పుడు కానీ ఈ మూగజీవాలకు రక్షణ ఉండదని అంటున్నారు.

Don't Miss