అందుకే.. ప్రధాని మోడీ ఆఫర్‌ను తిరస్కరించా - పవన్ కళ్యాణ్

15:28 - November 5, 2018

కాకినాడ: గుండెల్లో మురికి పెట్టుకుని బయట చెత్తని శుభ్రపరిస్తే ఏం లాభం? అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ముందు మన మనసులోని మలినాన్ని శుభ్రం చేసుకోవాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని ఉద్దేశించి పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. స్వచ్ఛభారత్ బ్రాండ్ అండాసిడర్‌గా నన్ను ఉండమని ప్రధాని మోడీ కోరారని, అయితే తాను తిరస్కరించానని పవన్ తెలిపారు.

Image may contain: 16 people, people smiling, wedding and crowdతూర్పుగోదావరి జిల్లాలో పారిశుధ్య కార్మికులతో పవన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన ప్రభుత్వం వస్తే రెల్లి కులస్తులకు తాను అండగా ఉంటానని పవన్ భరోసా ఇచ్చారు. తాను మాట సాయం కంటే చేత సాయం చేసే వాడిని అని పవన్ స్పష్టం చేశారు. రెల్లి కులస్తులకు తాను అండగా ఉంటాను, అన్నగా తమ్ముడిగా ఉంటానని జనసేనాని హామీ ఇచ్చారు. అన్నికులాల మలమూత్రాలు శుభ్రుపరిచే ఉన్నత కులం రెల్లి కులం అని పవన్ అన్నారు. మీ జీవితాల్లో వెలుగు నింపకపోతే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసినా ప్రయోజనం లేదన్నారు. రెళ్ల కులస్తులు ఇళ్లు అద్దెకు అడిగే స్థాయి నుంచి ఇళ్లు అద్దెకిచ్చే స్థాయికి తీసుకెళతానన్నారు. తాను అందరిలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడనని, హామీలు ఇవ్వను అని చెప్పిన పవన్.. తాను కేవలం ఆశయాలను పాటిస్తాను, మాట్లాడతాను, ఆచరిస్తాను అని చెప్పారు.

+

Don't Miss