రోడ్డు మీద ఉమ్మేస్తున్నారా.. అయితే.. భారీ మూల్యం తప్పదు!

12:21 - November 9, 2018

పూణే: పోతూ పోతూ రోడ్డు మీద ఉమ్మేసే వారిని నిత్యం మనం చూస్తూనే ఉంటాం. ఈ చెడు అలవాటు చదువుకున్న వారిలో సైతం ఉంటుంది. భాధించే అంశం ఏంటంటే వాళ్లు కనీసం తాము తప్పు చేస్తున్నాం అనే భావనకూడా వీరిలో కలగకపోవడం విచారకరం. ఇక మన హైదరాబాద్‌లో  అయితే చెప్పాల్సిన పనేలేదు. ఏ ప్రభుత్వ ఆఫీసులో చూసినా గోడలు పాన్ మరకలతో ఎంతో అసహ్యంగా ఉంటాయి. ఎన్ని తొట్లు పెట్టినా.. బోర్డులు పెట్టినా జనంలో మార్పు తీసుకురావడం కష్టం అనే అభిప్రాయం పాలకులలో గట్టిగా స్థిరపడిపోయింది.
అయితే మహారాష్ట్రలోని పూణే మునిసిపల్ పరిథిలో అధికారులు ఓ వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా రోడ్డు మీద ఉమ్మేస్తే రూ 100 జరిమానా విధిస్తున్నారు. ఇక్కడితో అయిపోలేదు వారిచేత రోడ్లు శుభ్రపరిచే కార్యక్రమాన్నికూడా చేపట్టారు పూణే మునిసిపల్ అధికారులు. ఈ కార్యక్రమాన్ని పూణేలోని బిబీవేవాడి ప్రాంతంలో విజయవంతంగా అమలు చేశారు. ఇప్పటివరకూ 25 మందికి ఇటువంటి శిక్షలు విధించినట్టు అధికారలు తెలిపారు. ఇది కఠినమైన శిక్షలే అని మాకు తెలుసు.. కానీ భవిషత్తులో పొగాకును నమిలి ఉమ్మేసే ముందు ఒకసారి ఆలోచిస్తారనే నమ్మకం మాకుంది అని స్థానిక అధికారులు అభిప్రాయపడ్డారు.
 

 

Don't Miss