అణు జలాంతర్గాముల దేశాల సరసన నిలిచిన భారత్

19:57 - November 5, 2018

ఢిల్లీ: భారత రక్షణ రంగ అమ్ముల పొదిలోకి  ఐఎన్ఎస్ అరిహాంత్ జలాంతర్గామి వచ్చి చేరింది. ప్రపంచంలో అణు జలాంతర్గాములను తయారు చేసి నడపగలిగిన రష్యా, చైనా, ఫ్రాన్స్, ఇంగ్లాడ్ దేశాల సరసన నేడు భారత్ చేరింది. మొదటిసారిగా గస్తీ పూర్తి చేసుకుని  విజయవంతంగా తిరిగి వచ్చిన సందర్భంగా ఐఎన్ఎస్ అరిహంత్ సిబ్బందితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం సమావేశమై వారిని అభినందించారు.  ఐఎన్ఎస్ అరిహాంత్ విజయం దేశ భద్రత పటిష్టతలో మరో పెద్ద ముందడుగని  ప్రధాన మంత్రి అన్నారు. 
6,000 టన్నుల బరువున్న ఐఎన్ఎస్ అరిహంత్ ను ప్రధాని మోడీ నేతృత్వంలోని న్యూక్లియర్ కమాండ్ అథారిటీ పర్యవేక్షణలో అభివృద్ధి చేశారు. ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ సాధించిన ఘనత దేశ చరిత్రలో ఎన్నటికీ గుర్తుండిపోతుందని ,. దేశభద్రత  విషయంలో  భారత్ మరో ముందడుగు వేసిందని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. ఇక నుంచి న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కు పాల్పడేవారికి  సరైన సమాధానం ఇవ్వగలిగిన స్ధాయికి మనం చేరాం అని మోడీ అన్నారు.  'ఐఎన్ఎస్ అరిహాంత్  సబ్‌మెరైన్ డిజైన్, నిర్మాణం, పరీక్షను సమర్ధవంతంగా నిర్వహించి ఇండియాను సొంత అణు జలాంతర్గాములున్న దేశాల స్థాయికి నిలిపిన యావన్మంది సిబ్బందికి ప్రధాని   ధన్యవాదాలు చెప్పారు.ఈ అణు జలాంతర్గామి అందుబాటులోకి రావడంతో ఉపరితల క్షిపణులు చేరుకోలేని లక్ష్యాలను సైతం ఇది చేధించగలదు.

 

 

Don't Miss