తొలి టీ20లో భారత్ ఘన విజయం

11:54 - November 5, 2018

ఢిల్లీ : తొలి టీ-20లో వెస్టిండీస్‌పై భారత్‌ విజయం సాధించింది. చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. భారత్‌కు ఆదిలో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ దినేశ్‌ కార్తీక్‌ నిలదొక్కుకోవడంతో.. 17.5 ఓవర్లలో విజయం సాధించి.. మూడు టీ-20ల సీరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. 

ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా వెస్టిండీస్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత తడబడిన భారత్‌ విండీస్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. 

110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు రోహిత్‌శర్మ, ధావన్‌లు వెంటవెంటనే ఔట్‌ కావడంతో భారత్‌ కొద్దిగా కష్టాల్లో పడింది. ఓ దశలో విజయానికి భారత్‌ ఎదురీదింది. దినేశ్‌ కార్తీక్‌ నిలకడగా ఆడడం.. చివర్లో పాండ్యా విండీస్‌ బౌలర్లపై విరుచుకుపడడంతో భారత్‌ 17.5 ఓవర్లలో విజయం సాధించింది. 

విండీస్‌ బౌలర్లలో థామస్‌, బ్రాత్‌వైట్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. పియరీకి ఒక వికెట్‌ దక్కింది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 3 వికెట్లు తీయగా, ఉమేశ్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌, బుమ్రా, కృనాల్‌ పాండ్యాలకు ఒక్కో వికెట్‌ దక్కింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌ 1-0తో ముందంజలో ఉంది.

Don't Miss