ఆసక్తి కలిగిస్తున్న దేవ్ టీజర్

10:31 - November 6, 2018

కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా, లైట్ హౌస్ మూవీ మేకర్స్ సమర్పణలో, రజత్ రవిశంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా, దేవ్.. రీసెంట్‌గా రిలీజ్ చేసిన దేవ్ ఫస్ట్‌లుక్‌కి ఆడియన్స్‌ నుండి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో దేవ్ టీజర్ విడుదల చేసింది చిత్ర బృందం. ఒక నిమిషం నిడివిగల టీజర్‌లో, సినిమా కాన్సెప్ట్ ఏంటో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేసారు. అందరిలా మెషీన్‌లా పని చెయ్యడం నచ్చని హీరో, బైక్ రేస్‌లో మాత్రం దూసుకుపోతుంటాడు. సదరు హీరో, తన మనసుకి నచ్చిన అమ్మాయిని లవ్ చెయ్యడం, తనని కాపాడుకోవడానికి ఫైట్ చెయ్యడం, ఫ్యామిలీతో సరదాగా టైమ్ స్పెండ్ చెయ్యడం, చిలిపిగా రొమాన్స్ చెయ్యడం, ఇలా, ఆసక్తికరంగా, ఆహ్లాదకరంగా అనిపిస్తుంది దేవ్ టీజర్. లుక్ వైజ్ కార్తి బాగున్నాడు. ఖాకీ తర్వాత కార్తి, రకుల్ ప్రీత్ కలిసి నటిస్తున్నారు, ఆన్ స్క్రీన్ ఇద్దరి  కెమిస్ట్రీ బాగుంది. హేరిస్ జయరాజ్ బ్యాగ్రౌండ్ స్కోర్, వేల్ రాజ్ కెమెరా వర్క్ బాగున్నాయి. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, నిక్కీ గల్రానీ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఖాకీ , చినబాబు వంటి హిట్ సినిమాలతో జోరుమీదున్న కార్తి, దేవ్‌ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న దేవ్, తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది..   

వాచ్ టీజర్..

 

Don't Miss