మహాకూటమిపై కోదండరామ్ కీలక నేతలు

09:44 - November 5, 2018

వరంగల్: తెలంగాణ జనసమితి చీఫ్ (టీజేఎస్) కోదండరామ్ మహాకూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి కూర్పు నత్తనడక వల్ల చాలా నష్టం జరుగుతుందని కోడందరామ్ హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రచారంలో ముమ్మరంగా సాగిపోతుంటే కూటమి ఇంకా మొదలే పెట్టలేదన్నారు. సీట్ల సర్దుబాటు ఇంకా తేలకపోవడంతో భాగస్వామ్య పక్షాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని కోదండరామ్ అన్నారు. పొత్తుల అంశం తేలితేనే నా పోటీపై స్పష్టత ఇస్తానని కోదండరామ్ పేర్కొన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకు నష్టం జరగకుండా ముందుకెళ్తామన్న కోదండరామ్.. సామాజిక న్యాయంపై ఉమ్మడి ఎజెండానే తమకు ముఖ్యమన్నారు. 

ఈ క్రమంలో టీఆర్ఎస్‌పై కోదండరామ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ రాజకీయాలు డబ్బు సంపాదన మీద తప్ప పనుల మీద దృష్టి పెట్టలేదన్నారు కోదండరామ్ ఆరోపించారు‌. టీఆర్‌ఎస్‌కు కాంట్రాక్టర్లు, కమిషన్ల మీద ఉన్న దృష్టి నిరుద్యోగుల పట్ల లేదని విమర్శించారు. ఈ రాజకీయాలు మారితేనే రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందన్నారు. ఈ రాజకీయాలు మార్చడానికే పార్టీ పెట్టినట్లు ఆయన చెప్పారు.

Don't Miss