గుజరాత్ సెక్రటేరియట్‌లోకి ప్రవేశించిన చిరుత

11:02 - November 5, 2018

గాంధీనగర్ (గుజరాత్): దారితప్పిన ఓ చిరుతపులి ఏకంకా రాష్ట్ర సచివాలయంలోకే ఎంటర్ అయ్యింది. గాంధీనగర్‌లోని సెక్రటేరియట్ సీసీటీవీలో చిరుత వంగిపోయి బారికేడ్ దాటటం సోమవారం తెల్లవారుఝామున రికార్డయ్యింది. అయతే దాని జాడ గర్తించడంలో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీసీటీవీ ఫుటేజీని ఆలస్యంగా గమనించిన భద్రతా సిబ్బంది చిరుత ఎక్కడ దాక్కుందో కనుక్కోనేందుకు వెతుకులాట ప్రారంభించారు. అయితే లోపలికి చొరబడిన చిరుత బయటకు వెళ్లిపోయిందా లేదా..లోపలే ఉందా అనేది ఇంకా తెలియరాలేదు. అడవిలో నీటి వనరులు లేకపోవడంతో పాటు ఆహారం అందక ఇటీవల కాలంలో చిరుతలు జనారణ్యంలోకి అడుగు పెడుతున్నాయి. చిరుత గేటు దాటుకొని లోపలకి ఎలా ప్రవేశించిందో మీరూ చూడండి!

Don't Miss