మధ్యప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్థి దేవి సింగ్‌ పటేల్‌ మ‌ృతి

14:03 - November 5, 2018

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్థి దేవి సింగ్‌ పటేల్‌ మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో మరణించారు. రాష్ట్ర మాజీ మంత్రి, రాజ్‌పూర్‌ నియోజకవర్గ అభ్యర్థి అయిన దేవి సింగ్‌ పటేల్‌‌కు గుండెపోటు రావడంతో బర్వానీ ఆస్పత్రికి తరలించారు.  చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. పటేల్‌ అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు బందర్‌కచ్‌ అనే గ్రామంలో జరగనున్నాయి. 

పటేల్‌ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంజార్‌ నియోజకవర్గం నుంచి మూడు సార్లు, రాజ్‌పూర్‌ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు కూడా రాజ్‌పూర్ నుంచి పోటీ చేయాల్సి ఉండగా ఇంతలోనే విషాదం నెలకొంది. మధ్యప్రదేశ్‌లో నవంబరు 28న పోలింగ్‌ జరగనుంది.

Don't Miss