మహాకూటమి నేతల భేటి

21:10 - November 5, 2018

హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో వారం రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ  ప్రారంభం అవుతుంది. నామినేషన్లకు టైం దగ్గర పడుతున్నప్పటికీ, కేసీఆర్ కు వ్యతిరేకంగా ఏర్పాటైన మహా కూటమిలో మాత్రం సీట్ల పంపకం ఇంకా తేలలేదు.  దీంతో భాగస్వామ్య పక్షాల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికి ఎన్నిసార్లు భాగస్వామ్య పార్టీలన్నీసమావేశం అయినా టికెట్ల సంఖ్య తేలలేదు. పొత్తులు, సీట్ల సర్దుబాటులో జాప్యంపై  ఇప్పటికే సీపీఐ అసహనం వ్యక్తంచేస్తోంది.  కూటమి బలోపేతంకు చాలా ఆలస్యం అయిందని, తొమ్మిది నియోజకవర్గాల్లో సీపీఐ పోటీ చేయబోతున్నట్టు  చాడ ప్రకటించారు. తొమ్మిది సీట్లు  ఇస్తేనే కూటమిలో  ఉంటామని చాడ  తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం మహాకూటమి ముఖ్య నేతలు పార్క్‌ హయత్‌ హోటల్‌లో  సమావేశం అవ్వాలని భావించారు. కానీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోదండరాం మాత్రం సమావేశమై సీట్ల విషయం చర్చించుకున్నారు.  సీట్ల విషయంలో స్పృష్టత ఉంది కనుక మీటింగ్ కు వెళ్లలేదని  టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ  చెప్పగా,  మీటింగ్ కు పిలవలేదని చాడ వెంకట రెడ్డి వ్యాఖ్యానించారు. 
ఇదే విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో ప్రస్తావించగా.......మహా కూటమి నుంచి ఎవరూ బయటకు వెళ్లడంలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉన్నందున రేపు ఢిల్లీకి వెళుతున్నామని, తిరిగి వచ్చాక కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని ఉత్తమ్ చెప్పారు.  కోదండరాంతో చర్చలు చాలా ఆరోగ్యకరమైన వాతావరణంలో జరిగాయని ,  రేపటిలోగా మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వస్తుందని ఉత్తమ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Don't Miss