మిత్రుడి మరణం, కేటీఆర్‌ని ప్రశ్నించిన మహానటి దర్శకుడు

19:09 - November 27, 2018

తెలంగాణాలో ఎన్నికల హడావిడి బీభత్సంగా ఉంది. డిసెంబర్ 7కి మరో పది రోజులే టైమ్ ఉండడంతో అధినేత కెసిఆర్ నుండి చోటా మోటా నాయకుల వరకు అందరూ ప్రచార పర్వంలో మునిగి తేలుతున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు పార్టీ మారి ఝలక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా ప్రజా సమస్యలపై సోషల్ మీడియాలో యాక్టివ్‌గా స్పందించే కేటీఆర్‌కి, మహానటి దర్శకుడు తెలంగాణా ప్రభుత్వ పనితీరుపై వేసిన ప్రశ్న ఒకటి ఆన్‌లైన్‌లో  తెగ వైరల్ అవుతుంది. అసలేం జరిగిందంటే, డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఫ్రెండ్‌కి ఆదివారం యాక్సిడెంట్ జరిగింది. అతణ్ణి గాంధీ హాస్పిటల్‌‌కి తీసుకెళ్ళగా, ఆదివారం కావడంతో డాక్టర్స్ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో, దాదాపు 3గంటలపాటు చావుబతుకులతో పోరాడుతూ చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఆ వార్డ్ అనీ, ఈ వార్డ్ అనీ చాలాసేపు అతని తల్లిదండ్రులతణ్ణి స్ట్రెచర్‌పై మోసుకుంటూ తిరిగారు. అతను గొప్ప కెమెరామెన్.. కేవలం డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వలనే ఒక నిండు ప్రాణం నిర్దాక్షిణ్యంగా బలైపోయింది అంటూ తన ఆవేదన వ్యక్తం చేసాడు నాగ్ అశ్విన్.  ఈ విషయాన్ని ట్వట్టర్‌లో షేర్ చేస్తూ, కేటీఆర్‌ని కూడా ట్యాగ్ చేసాడు. ఆ టైమ్‌లో గాంధీకి కాకుండా వేరే చోటకి తీసుకెళ్ళుంటే అతను ఖచ్చితంగా బతికేవాడు. తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఒక ప్రభుత్వాసుపత్రికి మనిషిని తీసుకెళ్ళి ఎందుకు బతికించుకోలేం? గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నిర్లక్ష్యానికి, చావుకి మారుపేరు కాకూడదు సార్.. దీని గురించి నేనెవర్ని ప్రశ్నించాలో అర్థం కావడంలేదు అని అశ్విన్ ట్వీట్ చేసాడు. అశ్విన్ తల్లిగారు కూడా డాక్టరే. వారికి సొంతగా ఒక హాస్పిటల్ కూడా ఉంది. నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్ గురించి, అడిగిన ప్రశ్న గురించి కేటీఆర్ నుండి ఎటువంటి సమాధానం వస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నెటిజన్లు.

Don't Miss