అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో మహానటి

10:43 - November 1, 2018

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన మహానటి చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది.
కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మించిన మహానటి చిత్రాన్ని, ఈ ఏడాది గోవాలో జరగబోయే 49వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నట్టు, ఇండియన్ పనోరమా బృందం ప్రకటించింది. ఈసారి చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు 22 ఫీచర్ ఫిలింస్‌తో పాటు, 4 మెయిన్ స్ట్రీమ్ సినిమాలను జ్యూరీ ఎంపిక చేసింది. 22 ఫీచర్ ఫిలింస్‌‌లో, ఐదు మలయాళం, ఐదు బెంగాలీ, రెండు హిందీ, ఒక జసారి, ఒక లదాఖి, రెండు  మరాఠీ, నాలుగు తమిళ్, ఒక తుళు చిత్రాలకు చోటు దక్కింది. మెయిన్ స్ట్రీమ్‌లో మహానటి (తెలుగు), టైగర్ జిందా హై ( హిందీ), పద్మావత్ ( హిందీ), రాజీ ( హిందీ), సినిమాలు స్క్రీనింగ్ అవనున్నాయి. ఇవేకాక, 21 నాన్ ఫీచర్ ఫిలింస్ కూడా ఎంపికవగా, మొదటి రోజు మలయాళ చిత్రం ఓఎల్‌యూ ని ప్రదర్శించనున్నారు. 

 

Don't Miss