సూపర్ స్టార్ ట్రైలర్‌పై సూపర్ స్పందన

19:12 - November 6, 2018


సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్‌ల కాంబినేషన్‌లో, రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ, 2.ఓ.. అక్షయ్ కుమార్ విలన్‌గా, అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటించారు. లైకా ప్రొడక్షన్స్‌ సుభాస్కరన్, రూ. 550 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఈ‌సినిమా ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది. కేవలం, 24 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు 2.ఓ ట్రైలర్ గురించి స్పందించగా, ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిప్రాయాన్ని ఆడియన్స్‌తో షేర్ చేసుకున్నాడు. 2.ఓ ట్రైలర్ చూసాను. అద్భుతంగా ఉంది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్, ఊహలకందని కాన్సెప్ట్, ఇక చిట్టీని వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది. శంకర్, రజనీ సర్, అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్‌లతో పాటు, 2.ఓ  టీమ్ అందరికీ శుభాకాంక్షలు.. అని, మహేష్ ట్వీట్ చేసాడు.
మహేష్ ట్వీట్‌కి శంకర్, అక్షయ్ కుమార్.. థ్యాంక్స్‌అని రిప్లై ఇచ్చారు. నవంబర్ 29న  2.ఓ  ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.  

 

Don't Miss