మావోయిస్టుల్లో మార్పు.. ఒకేసారి 51మంది లొంగుబాటు

14:02 - November 6, 2018

ఛత్తీస్‌గడ్: మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపూర్‌‌ జిల్లాలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ఏకంగా 51 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారంతా తమ ఆయుధాలను పోలీసులకు సరెండర్‌ చేశారు. పోలీసుల నిర్బంధం పెరుగుతుండటంతోనే మావోలు లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. చత్తీస్‌గడ్, నారాయణపూర్, బీజాపూర్‌లలో అడుగడుగునా బ్లాస్టింగ్‌లు, ఎన్2కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు గిరిజన ప్రజలు, ఇటు మావోయిస్టులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర, ప్రత్యేక బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. ఇక నిన్నటి ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోలు మృతి చెందారు. మరోవైపు మావోయిస్టులు జన జీవన స్రవంతి కలిసిపోవాలని ఎస్పీ కోరారు. హింస ద్వారా ఏమీ సాధించలేరని ఆయన చెబుతూ వచ్చారు. దాదాపుగా 10 రోజుల నుంచి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. మావోయిస్టులు లొంగిపోయేందుకు ముందుకు వచ్చారు. ప్రభుత్వ పథకాలు మీకు అందేలా సహకారం అందిస్తానని ఎస్పీ వారికి హామీ ఇచ్చారు. కాగా మరో 50మంది దాకా మావోయిస్టులు, మిలీషియా సభ్యులు సైతం లొంగిపోయేందుక సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Don't Miss