విశాఖ మన్యంలో మావోల అలజడి

13:42 - October 29, 2018

పాడేరు: విశాఖ మన్యంలో మావోయిస్టులు మళ్లీ  తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నించారు. జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలం ఆర్‌వీ నగర్‌ వద్ద  వెలసిన మావోల పోస్టర్లు, బ్యానర్లు  కలకలం రేపాయి. సోమవారం తెల్లవారుజామున వీటిని మావోలు పడేసినట్లు తెలుస్తోంది. "చట్టాల ప్రకారం అడవిపై హక్కు ఆదివాసీలదే అయినప్పటికీ అంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ది సంస్థ(ఏపీఎఫ్‌డీసీ) శ్రమ దోపిడీకి పాల్పడుతోంద"ని మావోయిస్టులు ఆ కరపత్రాల్లో ఆరోపించారు. "బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టి గిరిజనుల బతుకులను నాశనం చేయడానికి పూనుకున్న అధికార టీడీపీ, బీజేపీ నాయకులను మన్యం నుంచి తరిమి కొట్టాలని" మావోయిస్టులు పేర్కొన్నారు. ఈ సంఘటనతో మన్యంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. 
సెప్టెంబరు 23న అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోము ని మావోయిస్టులు హత్య చేసినప్పటినుంచి మన్యంలో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా పనిచేస్తున్నావంటూ గతంలో కిడారిని మావోయిస్టులు హెచ్చరించారు. చివరికి ఆయన మావోల చేతిలో హతమయ్యారు.   సోమవారం వెలసిన పోస్టర్లు, బ్యానర్లతో మన్యం ప్రజలు వణికిపోతున్నారు. 

Don't Miss