ప్రియానిక్ రిసెప్షన్‌: వేడుకల్లో మోడీ సందడి

09:12 - December 5, 2018

ఢిల్లీ: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జోనస్ వివాహ రిసెప్షన్ తాజ్ ప్యాలెస్ హోటల్‌లో వైభవంగా జరిగింది. బంధువులు, మిత్రులు, పలువురు సెలబ్రిటీలు తరలివచ్చారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరై స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. నూతన వధూవరులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారితో కలిసి ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో టీమిండియా కెప్టెన్ కోహ్లి, అనుష్క శర్మ వివాహ విందుకి మోదీ అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. సిల్వర్ కలర్ లెహెంగాలో ప్రియాంక, బ్లాక్ కోట్‌లో నిక్.. కలర్‌ఫుల్‌గా కనిపించారు.
నవంబర్ 28 నుండి డిసెంబర్ 3 వరకు ప్రియానిక్‌ల వివాహం జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు.

 

Don't Miss