రచయితకి క్రెడిట్ ఇచ్చిన సర్కార్ టీమ్

18:13 - October 30, 2018

ఇళయ దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందిన మూవీ సర్కార్.. రీసెంట్‌గా రిలీజ్ చేసిన సర్కార్ తమిళ్‌, తెలుగు టీజర్‌లకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది... తన కథ మురగదాస్‌ కాపీ చేసాడని, రచయిత వరుణ్ రాజేంద్రన్ కోర్ట్‌లో కేసు వేసిన సంగతి తెలిసిందే. మొదట సర్కార్ కథ తనదేననీ, ఏదైనా కోర్ట్‌లోనే తేల్చుకుంటానని చెప్పిన మురగదాస్‌, రచయిత వరుణ్ రాజేంద్రన్‌తో రాజీకి వచ్చాడు. అతనికి టైటిల్ క్రెడిట్‌తో పాటు, 30 లక్షల పారితోషికం కూడా ఇవ్వడానికి సన్ పిక్చర్స్ అండ్ దాస్ ఒప్పుకోవడంతో, సర్కార్ వివాదం సద్దుమణిగి, విడుదలకి లైన్ క్లియర్ అయిందని తెలుస్తుంది. దీని గురించి వివరణ ఇస్తూ, మురగదాస్‌ ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్ట్ చేసాడు. , కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్, రాధా రవి,యోగిబాబు తదితరులు నటించిన సర్కార్, దీపావళి కానుకగా నవంబర్ 6న తెలుగు, తమిళ్‌లో భారీగా రిలీజ్ కానుంది.

Don't Miss