దేవదాస్ పక్కా టైంపాస్

14:20 - September 27, 2018

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నానీ‌ల కాంబినేషన్‌లో, వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, సి.అశ్వనీదత్ నిర్మించిన  చిత్రం దేవదాస్..గీతగోవిందంతో యూత్‌లో మంచిక్రేజ్ సంపాదించుకున్నరష్మిక మందన్న, మళ్ళీరావా చిత్రంతో ఆకట్టుకున్నఆకాంక్ష సింగ్  హీరోయిన్స్‌గా నటించారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్,ట్రైలర్ అండ్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై పాజిటివ్  బజ్ ఏర్పడంది. భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన దేవదాస్ మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ : దేవా (నాగార్జున) ఒక డాన్. తనకు నచ్చిన దారిలో వెళ్తూ, తనదారికి అడ్డొచ్చిన వారిని తప్పించుకుంటూ వెళ్తుంటాడు. చాలాకాలంగా జాహ్నవి అనే న్యూస్‌రీడర్‌ని అమితంగా ఆరాధిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడూ ఆమెని కలవడు.దేవా డాన్ కాబట్టి అతనికి శత్రువులు తప్ప స్నేహితులెవరూ ఉండరు. అలాంటి టైమ్‌లో డాక్టర్ దాస్ (నాని)ని కలుస్తాడు దేవా. వృత్తిని గౌరవించే దాస్ దేవాకి వైద్యం చేస్తాడు. అప్పటినుండి ఇద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. దేవా ప్రవర్తనతో మొదట్లో కాస్త ఇబ్బందిపడ్డా, మెల్లగా అతనికి మిత్రుడవుతాడు దాస్. మరోవైపు పూజ అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. దేవా లవ్ చేస్తున్నవిషయం  తెలిసి ఆశ్చర్యపడ్డ దాస్..జాహ్నవి‌ని, దేవాని కలుపుతాడు.

అంతా హ్యాపీగా గడిచిపోతున్న సమయంలో ఊహించని ట్విస్ట్‌తో కూడిన కథ మొదలవుతుంది. అసలు దేవాకీ, దాస్‌కీ సంబంధం ఏంటి, దేవ డాన్‌గా మారడానికి కారణం ఏంటి? అనేది మిగిలిన కథ.

కింగ్ నాగార్జునకి కథల మీద మంచి జడ్జ్‌మెంట్ ఉందన్నసంగతి తెలిసిందే. దేవదాస్‌పై ముందు నుండి భారీ హోప్స్‌తో ఉన్నాడు. ఫ్యామిలీతో కలిసి ప్రివ్యూచూసి, జేబులో విన్నర్‌ని పెట్టుకుని ఎంజాయ్ చెయ్యడానికి విదేశాలకి వెళ్తున్నాఅని ట్వీట్ చేసి అందరిలోనూ ఆసక్తిని పెంచేసాడు.

దేవదాస్ చూస్తే నాగ్ నమ్మకం నిజమే అనిపిస్తుంది. నానీని ఓ రేంజ్‌లో ఆడుకుంటూనే, అతనితో కలిసి రచ్చ రచ్చ చేసాడు. చక్కటి కామెడీ టైమింగ్‌తో, తన స్టైల్ నటనతో అక్కినేని అభిమానుల్నీ, ఆడియన్స్‌నీ ఆకట్టుకున్నాడు.ఈ ఏజ్‌లోనూ టీనేజ్ కుర్రాళ్లు కుళ్ళుకునేంత, అమ్మాయిలు అసూయపడేంత అందంగా ఉన్నాడు నాగ్.

ఇక నాని విషయానికొస్తే అష్టకష్టాలూ పడే డాక్టర్ దాస్‌గా తన స్టైల్ నేచురల్ పెర్ఫార్మెన్స్‌తో ధియేటర్‌లలో నవ్వులు పూయించాడు. నాగార్జున లాంటి సీనియర్‌తో కలిసి చక్కగా నటించాడు. ఇద్దరు ముద్దుగుమ్మలు రష్మిక, ఆకాంక్ష.. అందం, అభినయంతో అలరించారు. వెన్నెలకిశోర్, నవీన్ చంద్ర, మురళీశర్మ, శరత్ కుమార్, అవసరాల శ్రీనివాస్, కునాల్ కపూర్ వారివారి క్యారెక్టర్స్‌కి న్యాయం చేశారు.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ చాలాకాలం తర్వాత ఈ సినిమాకి తనదైన శైలి సంగీతం అందించారు. వినాయకుడి సాంగ్‌తో పాటు.. వారూవీరూ, చెట్టుకింద డాక్టరూ లాంటిపాటలు చాలాబాగున్నాయి. రీరికార్డింగ్ కూడా బాగుంది. శ్యామ్‌దత్ కెమెరా వర్క్ బాగుంది.

దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఇంతకుముందు భలేమంచిరోజు, శమంతకమణి సినిమాలతో పర్వాలేదనిపించుకున్నాడు. ఈసినిమాకి సత్యానంద్, భూపతిరాజా వంటి సీనియర్ రచయితల సహాయం తీసుకున్నాడు. ఉన్నంతలో కథని తన స్టైల్‌లో చెప్పే ప్రయత్నం చేసాడు. చిన్నచిన్న లోపలున్నాయి అవిలేకుండా చూసుకునుంటే బాగుండేది, కానీ, నాగ్, నానీల మ్యాజిక్ ముందు అవన్నీ కనబడవు. మొత్తంమీద కడుపుబ్బా నవ్వుకోవాలకంటే మాత్రం దేవదాస్ చూడాల్సిందే.

 బ్యానర్  :  వైజయంతీ మూవీస్

నటీనటులు : నాగార్జున, నాని, రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్, ప్రభాకర్, వెన్నెలకిశోర్, నవీన్ చంద్ర, మురళీశర్మ, శరత్ కుమార్, అవసరాల శ్రీనివాస్, కునాల్ కపూర్...
 సంగీతం :  మణిశర్మ
 కెమెరా :  శ్యామ్‌దత్ సయినుద్దీన్
ఎడిటింగ్ :  ప్రవీణ్ పూడి
    

రేటింగ్ : 3/5

Don't Miss