నౌహీరా షేక్‌కు బెయిల్ మంజూరు

22:32 - October 24, 2018

హైదరాబాద్ : హీరా గ్రూప్ చైర్‌పర్సన్ నౌహీరా షేక్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. సీసీఎస్ పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. నౌహీరా షేక్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ప్రాసిక్యూషన్ వాదనలతో సంత‌ృప్తి చెందని కోర్టు.. కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. రూ.5 లక్షలతోపాటు రెండు షూరిటీలతో రూ.5 కోట్లను ఈనెల 29లోగా కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సమయానికి డిపాజిట్ చేయకపోతే మాత్రం బెయిల్ రద్దు చేస్తామని పిటిషనర్‌ను కోర్టు హెచ్చరించింది. దీంతోపాటు కోర్టు అనుమతి లేకుండా నగరం విడిచి వెళ్లకూడదని.. నౌహీరా షేక్ పాస్‌పోర్టును సీజ్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

నౌహీరా తరపు న్యాయవాది వినీత్‌దండా కోర్టులోకి వస్తున్న సమయంలో బాధితులు ఆందోళనకు దిగారు. బాధితులపై అతని బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు బౌన్సర్లను పోలీసీులు అరెస్టు చేశారు.  

 

Don't Miss