ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు

16:18 - September 21, 2018

సమ్మోహనం సక్సెస్ తో సుధీర్ బాబు ట్రాక్ లోకి వచ్చాడు. ప్రతిభకి పెద్దపీట వేస్తూ వైవిధ్య భరితమైన సినిమాలు రూపొందించాలని తన పేరుతో ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఆర్.ఎస్.నాయుడుని దర్శకుడిగా పరిచయం చేస్తూ నన్నుదోచుకుందువటే చిత్రం చేసాడు. ఈ రోజు రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.. 

కథ : -
ఐటీ కంపెనీలో పనిచేసే కార్తీక్ పనితప్ప వేరే ప్రపంచమేలేదు అన్నట్టుగా బ్రతుకుతూ ఉంటాడు. ఫ్యామిలీని కూడా సరిగా పట్టించుకోడు. దీంతో కార్తీక్ కి తన మరదలితో పెళ్ళిచెయ్యాలని వాళ్ళ నాన్న డిసైడ్ అవుతాడు. మరదలు వేరే వ్యక్తితో ప్రేమలో ఉందని తెలిసి, పెళ్లిని తప్పించుకోవడానికి తను కూడా వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి కాలేజ్ లో చదువుతూషార్ట్ ఫిలిమ్స్ లో నటించే మేఘన అనే అమ్మాయిని అప్రోచ్ అవుతాడు. మేఘన కార్తీక్ మరదలుగా నటిస్తుంది. ఆక్రమంలో ఒకరినొకరు ఇష్టపడ్డా పైకి చెప్పుకోరు. అంతలోనే విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. విడిపోయిన కార్తీక్, మేఘన కలిసారా లేదా అనేది మిగతా కథ..

కార్తీక్ గా సుధీర్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా, మేఘనగా నభా నటేష్ తన అందం, నటనతో ఆడియన్స్ ని అలరించింది. నాజర్, పృధ్వీ, తులసి, వైవా హర్ష వారి వారి పాత్రలకి న్యాయం చేశారు. టెక్నికల్ గా కూడా సినిమా ఆకట్టుకుంది. సింపుల్ పాయింటే అయినా దర్శకుడు కొత్తగా చెప్పే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. నిర్మాతగా సుధీర్ బాబు బోణి బాగుంది. మొత్తం మీద నన్ను దోచుకుందువటే సినిమా చక్కటి టైంపాస్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు.

రేటింగ్ : 3/5 

Don't Miss