నారా, మెగా కోడళ్ళ సందడి

15:12 - November 27, 2018

నందమూరి బాలకృష్ణ పెద్ద కూతురు, ఏపీ మంత్రి లోకేష్ వైఫ్ నారా బ్రహ్మణి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కొణిదెల ఇద్దరూ కలిసి ఈజిప్ట్‌లో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళ ట్రిప్‌కి సంబంధించిన ఫోటోలిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్రహ్మణి, ఉపాసన మంచి ఫ్రెండ్స్. బ్రహ్మణి హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, ఉపాసన అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్‌గా క్షణం తీరికలేకుండా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీళ్ళిద్దరూ యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్(YPO) లో మెంబర్స్‌గా ఉన్నారు. YPO వాళ్ళు రీసెంట్‌గా 85మంది సభ్యులతో ఈజిప్ట్ ట్రప్ ప్లాన్ చేసారు. అందులో భాగంగా ఈజిప్ట్‌లోని ఫేమస్ పిరమిడ్ గిజా దగ్గర బ్రహ్మణి, ఉపాసన అండ్ YPO టీమ్ అంతా కలిసి తీసుకున్న సెల్ఫీని ఉపాసన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది. గురు, శుక్ర, శని వారాలు ఈజిప్ట్ అంతా తిరిగి హిస్టరీకి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈ ట్రిప్ నేనెప్పటికీ మర్చిపోలేను అని ఉపాసన చేసిన ట్వీట్, నందమూరి, నారా, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే, బ్రహ్మణి నాన్న బాలయ్య, మామ చంద్రబాబు, ఉపాసన చినమామ పవన్  కళ్యాణ్ రాజకీయంగా ప్రత్యర్ధులుగా ఉన్నా, వీళ్థిద్దరూ స్నేహంగా ఉండడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

 

Don't Miss