రక్తికట్టని ‘నాటకం’.

16:56 - September 28, 2018

ఈ ఏడాది టాలీవుడ్‌లో చిన్నసినిమాలుగా వచ్చి సంచలన విజయం సాధించాయి అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్100 చిత్రాలు.. ట్రైలర్స్, పోస్టర్స్‌లో యువతని ఆకట్టుకునే ఘాటైన సీన్స్ ఉండడంతో రిలీజ్‌కు ముందే మౌత్ టాక్‌తో మంచి పబ్లిసిటీ దొరికింది.. ఇప్పుడు అదేకోవలో ‘నాటకం’ అనే సినిమా రూపొందింది..  పోస్టర్స్, ట్రైలర్స్‌లో మసాలా కనబడడంతో, ఆడియన్స్‌ను  ఇది అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్100 తరహా సినిమా కాబోలు అనే ఆలోచనతో సినిమా చూస్తారనే అపోహతో చిత్రాన్ని రూపొందించినట్టు అనిపిస్తోంది. నటనపై మక్కువతో సినిమాఫీల్డ్‌కు వచ్చి, పటాస్, డీజే, లై, విన్నర్ వంటి సినిమాల్లో విలన్ వేషాలు వేసిన హైదరాబాద్ కుర్రాడు ఆశిష్ ఈ ‘నాటకం’ మూవీతో హీరోగా మారాడు.

ఆశిష్ గాంధీ, ఆషిమా నెర్వాల్ జంటగా, కళ్యాణ్ జీ గోగన దర్శకత్వంలో, రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శ్రీ సాయిదీప్ చాట్ల, రాధికాశ్రీనివాస్, ప్రవీణ్ గాంధీ, ఉమా కూచిపూడి నిర్మించిన ‘నాటకం’ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా ఎలాఉందో చూద్దాం...

కథ :

చింతలపూడి గ్రామంలో పనీపాటాలేకుండా జులాయిగా తిరిగే బాలకోటేశ్వరరావు.. అదే గ్రామానికి చెందిన పార్వతిని లవ్ చేస్తాడు. అనాథ అయిన పార్వతి కొద్దిరోజులకి  బాలకోటేశ్వరరావుని ప్రేమిస్తుంది.
ఒకానొక సంధర్భంలో ఇద్దరూ శారీరకంగా కలుస్తారు. వీళ్ళ ప్రేమకథ సాఫీగా సాగిపోతున్న టైంలో ఆ ఊళ్ళోకి ఒక దొంగల ముఠా ప్రవేశిస్తుంది. వాళ్ళ దెబ్బకి ఊరుఊరంతా భయంతో వణికిపోతుంది. ఇదిలాఉండగా ఒకరోజు బాలకోటేశ్వరరావుకి పార్వతి గతం తెలుస్తుంది. అసలు పార్వతి ఎవరు, చింతలపూడి గ్రామంలో జరిగే అనూహ్య పరిణామాలకి కారణం ఏంటి అన్నది మిగతాకథ..

నటీనటులు :

ఆశిష్ గాంధీ గెడ్డంతో మాస్పివ్ లుక్‌లో, మొరటోడిగా, విలేజ్  కుర్రాడిగా చాలా బాగా నటించాడు.. తనపాత్రలోని షేడ్స్‌కి తగ్గ హావభావలతో ఆకట్టుకున్నాడు. హీరోగా ఆశిష్‌కి మంచి భవిష్యత్తు ఉటుందని చెప్పొచ్చు..
హీరోయిన్ ఆషిమా నెర్వాల్ అందం, అభినయంతో అలరించింది.. హాట్ సీన్స్‌లో కుర్రకారుకి కిక్కెక్కించింది. హీరో తండ్రిగా తోటపల్లి మధుతోపాటు, మిగతా నటీనటులు కూడా ఉన్నంతలో బాగానే చేసారు.

టెక్నికల్ టీమ్ : 

గరుడవేగ అంజి కెమెరా వర్క్ బాగుంది. పాటల్లో మంచి ఫ్రేమ్స్ పెట్టాడు.. సాయికార్తీక్ సాంగ్స్, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.. ఎడిటర్ మణికాంత్ తన కత్తెరకి కాస్త పదునుపెట్టుంటే బాగుండేది.. దర్శకుడు కళ్యాణ్‌జీ గోగన ఆడియన్స్‌ని కొంతవరకు మెప్పించగలిగాడు కానీ, కథాకథనాలమీద ఇంకొంచెం శ్రధ్ద పెట్టి ఉంటే బాగుండేది.. లాజిక్ లేని సన్నివేశాలతో గందరగోళానికి గురిచేసాడు.. ఈ జాగ్రత్తలు తీసుకొని ఉండుంటే నాటకం రక్తి కట్టేది.. నిర్మాతలు కొత్తవారైనా కథకి తగ్గట్టు బాగానే ఖర్చుచేసారు.. బీసీ సెంటర్ ఆడియన్స్ వరకూ ఓకే కానీ.. క్లాస్ ఆడియన్స్‌కి  ఈ నాటకం అంతగా నచ్చక పోవచ్చు..అసలు ‘నాటకం’ అనే టైటిల్‌కు ఎక్కడా పొంతన కుదరకపోవడం సినిమాకి మరో మైనస్. 

   నటీనటులు  :  ఆశిష్ గాంధీ, ఆషిమా నెర్వాల్, తోటపల్లి మధు...
    సంగీతం      :  సాయికార్తీక్
    ఫోటోగ్రఫీ     :  గరుడవేగ అంజి
   ఎడిటింగ్      :  మణికాంత్
   దర్శకత్వం   :  కళ్యాణ్ జీ గోగన 
   నిర్మాతలు   :   శ్రీ సాయిదీప్ చాట్ల, రాధికాశ్రీనివాస్, ప్రవీణ్ గాంధీ, ఉమా కూచిపూడి...

రేటింగ్ : 2.5/5 

Don't Miss