ఏపీ డీజీపీ, విశాఖ ఎస్పీకి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు

12:35 - November 2, 2018

హైదరాబాద్ : ఏపీ డీజీపీ, విశాఖ ఎస్పీలకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. విశాఖ ఎయిర్‌పోర్టులో వైసీపీ అధినేత జగన్‌పై జరిగిన దాడికి సంబంధించిన వివరాలు 30 రోజుల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందంటూ మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రామ్‌ప్రసాద్.. జాతీయ ఎస్సీ కమిషన్‌కు లేఖ రాశారు. రామ్‌ప్రసాద్ లేఖకు స్పందించిన ఎస్సీ కమిషన్.. ఏపీ డీజీపీ, విశాఖ ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. 

 

Don't Miss