నవాబ్...మణిరత్నం మార్క్ సినిమా..

16:05 - September 27, 2018

క్రియేటివ్‌ డైరెక్టర్ మణిరత్నం గత చిత్రం చెలియా ప్రేక్షకులని నిరాశపరిచింది. ఈ నేపధ్యంలో ఆయన తదుపరి చిత్రం నవాబ్‌పై బాగానే అంచనాలున్నాయి. నవాబ్‌కి మణి సార్ టీమ్.. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్, ఎడిటర్ శ్రీకర్‌ ప్రసాద్ పనిచేసారు. భారీతారాగణం,ప్రోమోలవీ ఆసక్తికరంగా ఉండడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది.తమిళ్ లో చెక్క చెవంద వానం పేరుతో రూపొంది, తెలుగులో నవాబ్ గా ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాఉందో చూద్దాం.

కథ :
భూపతి రెడ్డి రాజకీయవర్గాల్లో పేరుమోసిన వ్యక్తి. భార్య అతనితోనే ఉంటుంది. భూపతి ముగ్గురు కొడుకులు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటుంటారు. ఒకరోజు ప్రత్యర్ధులు భూపతి మీద ఎటాక్ చెయ్యడంతో అతని ముగ్గురు కొడుకులూ చూడడానికివస్తారు. తండ్రిపై దాడిచేసిన వ్యక్తి అల్లుణ్ణి, భూపతి పెద్దకొడుకు వరద చంపేస్తాడు. అప్పటినుండి గొడవలు మొదలవుతాయి. సడెన్‌గా భూపతి కూడా చనిపోతాడు. అన్నదమ్ముల మధ్య అంతర్యుధ్ధం మెుదలవుతుంది. ఆ ప్రాసెస్‌లో భాగంగా భూపతి మరణం గురించి కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. భూపతి ఎలా చనిపోయాడు, అతని కొడుకుల మధ్య పగ చల్లారిందా, లేదా అనేది మిగతా కథ...

నటీనటుల పర్ఫార్మెన్స్ : 
భూపతి రెడ్డిగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలి నటనతో మెప్పించగా, అతని భార్యగా సహజనటి జయసుధ తల్లిపాత్రలో చక్కగా నటించారు. భూపతి ముగ్గురు కొడుకులుగా అరవింద్ స్వామి, శింబు, అరుణ్ విజయ్ పోటా పోటీగా నటిస్తే, అరవింద్ స్వామి భార్యగా జ్యోతిక, ప్రేయసిగా అదితిరావ్ హైదరి, మిగతా పాత్రల్లో ఐశ్వర్య రాజేష్, డయాన ఆకట్టుకున్నారు.  అరవింద్ స్వామి పోలీస్  ఫ్రెండ్‌గా మంచి కామెడీ టైమింగ్‌తో విజయ్ సేతుపతి అలరించాడు.
ఏ.ఆర్.రెహమాన్ కంపోజ్ చేసిన మ్యూజిక్ అండ్ ఆర్ఆర్ అద్భుతం అనేచెప్పాలి. సంతోష్ శివన్ కెమెరా, శ్రీకర్‌ ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇక మణి సార్ విషయానికొస్తే, వినూత్న కథాకథనాలతో, తనశైలి మేకింగ్‌తో ఎందరో అభిమానులని సంపాదించుకున్నారాయన. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలతో నిరాశపరిచిన మాట వాస్తవమేకానీ, ఇప్పుడు మాత్రం నవాబ్ చిత్రంతో మరోసారి తనకితానే సాటి అని ప్రూవ్ చేసారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగాసాగే కథాకథనాలతో, చక్కటి ఎమోషన్‌తో మణి సార్ నవాబ్‌ని మలిచిన విధానం ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. నటీనటుల పర్ఫార్మెన్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ,మణిరత్నం బ్రాండ్... నవాబ్ చిత్రాన్ని హిట్ సినిమాగా నిలబెట్టాయని చెప్పోచ్చు. 

నవాబ్...మణిరత్నం మార్క్ సినిమా..

తారాగణం :
ప్రకాష్ రాజ్, జయసుధ, అరవింద్ స్వామి, శింబు, అరుణ్ విజయ్, జ్యోతిక,అదితిరావ్ హైదరి,ఐశ్వర్య రాజేష్ తదితరులు...
సంగీతం :  ఏ.ఆర్.రెహమాన్
ఫోటోగ్రఫీ : సంతోష్ శివన్
ఎడిటింగ్ : శ్రీకర్‌ ప్రసాద్
రేటింగ్  2.75 / 5

Don't Miss