షుగర్ వ్యాధిగ్రస్తులకోసం సరికొత్త ఆహారం!

17:06 - November 20, 2018

ముంబై: సరైన ఆహార నియమాలు పాటిస్తే.. షుగర్ వ్యాధిని నిరోధించవచ్చని.. రెండు పూటల మాత్రమే ఆహారం తీసుకోవాలని ప్రముఖ సోషల్ మెడిసిన్ ఫ్రోఫెసర్ డాక్టర్ జగన్నాథ్ దీక్షిత్ చెబుతున్నారు. ఒబేసిటీ, డయాబిటీస్ వ్యాధుల నివారణపై ప్రచారానికి మహారాష్ట్ర వైద్య విద్య విభాగం డాక్టర్ దీక్షిత్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా షుగర్ వ్యాధిని అదుపులో ఉంచవచ్చని లాటూర్ మెడికల్ కళాశాలలో కమ్మూనిటీ మెడిసిన్ విభాగానికి అధిపతిగా ఉన్న డా..దీక్షిత్ చెప్పారు. 
ఇది డా..శ్రీకాంత్ జిచ్‌కర్ 1997-2004 ప్రాంతంలో రూపోందించిన డైట్ ప్లాన్ సిద్ధాంతాన్ని తాను అమలు చేస్తున్నానని..అయితే డా..జిచ్‌కర్ మన మథ్య లేకపోయినా ఈ సిద్ధాంతంపై పరిశోధనలు కొనసాగిస్తానని దీక్షిత్ వెల్లడించారు. కేవలం రెండు సార్లు ఆహారం తీసుకోవడం ద్వారా షుగర్‌ను అలానే ఒబేసిటీని అదుపులో ఉంచవచ్చని దీక్షిత్ తెలిపారు.
 

 

Don't Miss