మహానటి సావిత్రిగా ఆకట్టుకుంటున్న నిత్యా మేనన్

11:13 - November 6, 2018

నందమూరి బాలకృష్ణ,దర్శకుడు క్రిష్ కాంబినేషన్‌లో, ఎన్టీఆర్ బయోపిక్‌ని, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు పేర్లతో రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్  శరవేగంగా జరుపుకుంటుంది. మరోవైపు ప్రమోషన్స్‌లోనూ మూవీ యూనిట్ చాలా యాక్టివ్‌గా ఉంది.. ఇప్పటి వరకు విడుదల చేసిన బాలయ్య వివిధ లుక్స్‌కి, సుమంత్, రానా, కళ్యాణ్ రామ్,  రకుల్ ప్రీత్ సింగ్, భరత్ రెడ్డి లుక్స్‌కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్‌తో పలు విజయవంతమైన చిత్రాల్లో, ఆయనకు పోటాపోటీగా నటించిన మహానటి సావిత్రి లుక్‌ని దీపావళి సందర్భంగా విడుదల చేసారు. మొదట ఈ పాత్రకు మహానటిలో సావిత్రిగా అలరించిన కీర్తి సురేష్‌ని తీసుకోవాలనుకున్నారు, ఆవిడ ఒప్పుకోకపోవడంతో, నిత్యాని తీసుకున్నారు. మహానటిలోనూ తొలుత సావిత్రి పాత్రకోసం, నిత్యా మేనన్ పేరు వినబడింది. ఇప్పుడు ఈ బయోపిక్‌లో, ఆమె సావిత్రిలా నటించడం యాధృచికం. గుండమ్మ కథ చిత్రంలో, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం పాటలోలా, ఎన్టీఆర్‌లా బాలయ్య పిండి రుబ్బుతుంటే, అచ్చ తెలుగు కట్టూ, బొట్టులో సావిత్రిగా మారిన నిత్యా మేనన్ చూడచక్కగా ఉన్న ఈ పోస్టర్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సావిత్రిగా నిత్యా మేనన్ పర్‌ఫెక్ట్‌గా సెట్ అయింది అంటున్నారు నందమూరి అభిమానులు. తొలిభాగం, ఎన్టీఆర్ కథానాయకుడు, జనవరి 9న, రెండోభాగం, ఎన్టీఆర్ మహానాయకుడు జనవరి 24న విడుదల కాబోతున్నాయి.  

 

Don't Miss