స్టేజి మీదే కుప్పకూలిన నితిన్ గడ్కరి

15:27 - December 7, 2018

ముంబై: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అస్వస్ధతకు గురయ్యారు. శుక్రవారం గడ్కరీ మహరాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని మహాత్మా పూలే  వ్యవసాయ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.  ఆ కార్యక్రమంలో జాతీయగీతం ఆలపించే సమయంలో లేచి నిలబడినప్పుడు షుగర్ లెవల్స్ పడిపోవటంతో ఆయన స్టేజీమీద కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్న గవర్నర్ సిహెచ్ విద్యాసాగర రావు ఆయన పడిపోకుండా చేయి అందించి పైకి లేపే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న సహాయక సిబ్బంది ఆయన్ను వెంటనే  ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 
ప్రస్తుతం తాను డాక్టర్ల పర్యవేక్షణలో క్షేమంగానే ఉన్నానని గడ్కరీ ట్వీట్ చేసారు. తాను కోలుకోవాలవి కోరుకున్నవారందరికీ  నితిన్ గడ్కరీ  కృతజ్ఞతలు తెలిపారు. 

Don't Miss