రేప్ చెయ్యలేదు.......పల్లవి అనుమతితోనే..

18:46 - November 2, 2018

ఢిల్లీ: అమెరికాకు చెందిన పల్లవిగొగోయ్ అనే జర్నలిస్టు తనను రేప్ చేశానని చేసిన ఆరోపణలను కేంద్ర మాజీ విదేశాంగశాఖ సహాయ మంత్రి ఎంజేఅక్బర్ ఖండించారు. పల్లవి ఆరోపణలను అక్బర్ భార్య మల్లికాఅక్బర్ కూడా ఖండించారు. ఎంజే అక్బర్ జర్నలిస్టుగా పని చేసిన రోజుల్లో లైంగిక వేధింపులకు గురిచేశారని 12 మంది మహిళలు ఆరోపించినా స్పందించని అక్బర్ భార్య మల్లికా అక్బర్, పల్లవి అబద్దాలాడుతోందని ఆమె ఆరోపణలను ఖండించారు.  
పల్లవిగొగొయ్ ఆరోపణలపై  కేంద్ర  మాజీ మంత్రి   అక్బర్  మాట్లాడుతూ..."1994లో పరస్పర అంగీకారంతో మాఇద్దరి మధ్య బంధం ఉన్నమాట వాస్తవమేనని, ఈవిషయం అందరికీ తెలుసని, ఆ బంధం వల్ల మాకుటుంబంలో గొడవలు వచ్చాయని, కొన్నాళ్ళకి ఆబంధం ముగిసిందని, కాకపోతే మామధ్య ఉన్న బంధానికి మంచి ముగింపు ఇవ్వలేకపోయాం" అని చెప్పుకొచ్చారు. 
అక్బర్ భార్య మల్లికా అక్బర్ పల్లవి ఆరోపణలపై స్పందిస్తూ " ఇన్నాళ్లూ  నా భర్తపై వస్తున్న  "మీటూ" ఆరోపణలపై మౌనంగా ఉన్నాను. కానీ పల్లవి ఈరోజు చేసిన ఆరోపణలు అబ్దదాలు అని కొట్టిపారేస్తూ.."1994లో మావారికి పల్లవికి ఉన్న బంధం గురించి తెలిసింది. కొన్నిసార్లు ఆమె నాఎదుటే నాభర్తపై ప్రేమ కురిపించేది. అది మాఇంట్లో కలతలకు దారితీసింది. ఈ విషయమై  ఆయన్ను అడగ్గా, మావారు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు" అని చెప్పారు. 

Don't Miss