ఏపీ పోలీస్‌శాఖలో 3,137 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

08:53 - November 2, 2018

హైదరాబాద్ : ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్ర పోలీసు శాఖలోని ఖాళీగా ఉన్న ఎస్సై పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 3,137 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సైతో పాటు అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌, కానిస్టేబుళ్లు, డిప్యూటీ జైలర్, వార్డర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 5 నుంచి 24 వరకు  అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సై పోస్టులకు రాత పరీక్షను డిసెంబర్ 16న నిర్వహించనున్నారు. పోలీస్‌ కానిస్టేబుల్, వార్డర్ల అప్లికేషన్లు ఆన్‌లైన్‌ ద్వారా ఈ నెల 12 నుంచి డిసెంబర్‌ 7 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

 

Don't Miss