ఒడిశాలో ఎన్‌కౌంటర్.. ఐదుగురు మవోయిస్టులు మృతి

10:36 - November 5, 2018

ఒడిశా: మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. మల్కన్‌గిరి జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు మావోలు మృతి చెందారు. అల్లూరు కోట, సన్యాసిగూడ గ్రామ పరిసరాల్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కొంతమంది మావోలు అక్కడే ఉన్నారన్న సమాచారంతో కూంబింగ్‌ను నిర్వహిస్తున్నారు.

Don't Miss