చంద్రబాబు ప్రశ్నకు పవన్ సమాధానం

15:12 - November 6, 2018

హైదరాబాద్: తిత్లీ తుఫాను విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు తనపై చేసిన విమర్శలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. తిత్లీ తుఫాను విధ్వంసం గురించి తెలియజేస్తూ కేంద్రానికి కనీసం లేఖ కూడా రాయలేదన్న చంద్రబాబు ఆరోపణలను పవన్ కొట్టిపారేశారు. తిత్లీ తుఫాను కారణంగా జరిగిన నష్టం గురించి తాను కేంద్రానికి లేఖ రాశానని పవన్ చెప్పారు. అందుకు ఇదే సాక్ష్యం అంటూ తాను రాసిన లేఖను పవన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ లెటర్ మీద అక్టోబర్ 26 అనే తేదీని చూడొచ్చు. తిత్లీ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకోవాలని పవన్ ఆ లేఖలో ప్రధానిని కోరారు. కాగా, ప్రజల్లో తనకు లభిస్తున్న ఆదరాభిమానాలు చూసి ఓర్వలేకనే చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేశారని పవన్ మండిపడ్డారు.

Don't Miss