చంద్రబాబు హయాంలోనే తెలంగాణ యువతలో కోపాన్ని చూశా - పవన్ కళ్యాణ్

17:12 - November 6, 2018

కాకినాడ: రాష్ట్రం విడిపోవ‌డానికి కార‌ణం ఎస్ఈజెడ్‌లే అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాత్రికి రాత్రి భూములు లాక్కోవ‌డం, ఊర్ల‌కి ఊర్లు ఖాళీ చేయించ‌డం దారుణం అన్నారు. తెలంగాణలో యువ‌త చాలా ఆవేద‌న‌తో, కోపంతో ఉండేదన్నారు. చంద్ర‌బాబు హ‌యాంలోనే ఇది మొద‌ల‌య్యిందన్నారు. కొండ‌లు, పీఠ‌భూములు ఇష్టారాజ్యంగా త‌వ్వేస్తే, అవి మ‌ళ్లీ తిరిగి రావన్నారు. ప్ర‌కృతిని ర‌క్షించాల‌న్న బాధ్య‌తే తనను రాజ‌కీయాల వైపు న‌డిపించిందని పవన్ చెప్పారు. ప్ర‌కృతి-రైతుని ప‌రిర‌క్షించే స‌మాజం లేన‌ప్పుడు, అంద‌రికీ అన్నం పెట్టే రైతులు ప‌స్తులుండి చ‌నిపోతున్న‌ప్పుడు ఎందుకీ వ్య‌వ‌స్థ‌ అని ప్రశ్నించారు. రాజ‌కీయ పార్టీలే సెజ్‌ల‌ని తీసుకువ‌చ్చాయని, ఎస్ఈజెడ్‌ల‌ని తీసుకురావ‌డానికి కార‌ణం విప‌రీత‌మైన భూదాహం అని పవన్ ఆరోపించారు. ఇలాంటి భూదాహం ప్ర‌పంచంలో మ‌రే దేశంలో లేదన్నారు. 

* అధికారంలోకి వ‌స్తే సెజ్ రైతుల‌పై కేసులు ఎత్తేస్తాం
* రైతు క‌న్నీరు దేశానికి క్షామం
* సామ‌ర‌స్య పూర్వక ప‌రిష్కారానికి క‌ట్టుబ‌డి ఉంటాం
* కాకినాడ ఎస్ఈజెడ్‌పై జ‌న‌సేన త‌రపున ప్రత్యేక క‌మిటీ

జ‌న‌సేన పార్టీ ప్ర‌భుత్వం వ‌స్తే కాకినాడ ఎస్ఈజెడ్ రైతుల‌పై పెట్టిన కేసులు ఎత్తివేస్తామ‌ని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అందుకు సంబంధించి చ‌ట్ట‌ప‌ర‌మైన ఇబ్బందులు ఉన్నా అధిగ‌మిస్తామ‌న్నారు. మంగ‌ళ‌వారం కాకినాడ జీ.కన్వెన్ష‌న్ హాల్లో సెజ్ బాధితుల‌తో పవన్ స‌మావేశ‌మ‌య్యారు.

Image may contain: 15 people, crowdగ‌త 13 ఏళ్లుగా తాము ప‌డుతున్న ఇబ్బందుల‌ని సెజ్ బాధితులు ప‌వ‌న్‌ ముందు ఇంచారు. రాత్రికి రాత్రి ఊళ్ళు ఖాళీ చేయించార‌నీ, సెజ్ కార‌ణంగా తమ భూములు బీడు వారిపోతున్నాయని,  తమ పిల్ల‌ల భ‌విష్య‌త్తు బీడు వారిపోతోంద‌ని వారు వాపోయారు. వారి బాధలు విన్న తర్వాత మాట్లాడిన పవన్.. కాకినాడ సెజ్ బాధితుల‌కి జ‌న‌సేన పార్టీ అండ‌గా ఉంటుందని హామీ ఇచ్చారు.

Image may contain: 2 people, people smilingఎస్ఈజెడ్‌ల ఏర్పాటుకి సంబంధించి తనకు స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఉందన్నారు. ప‌రిశ్ర‌మ‌లు స్థాపించేందుకు భూములు తీసుకుంటే, ఓ నిర్ణీత గ‌డువులో వాటిని వినియోగించాలన్నారు. అలా చేయ‌లేన‌ప్పుడు ఎవ‌రి భూములు వారు తిరిగి తీసేసుకునే హ‌క్కు ఉందన్నారు. అయితే ఇక్క‌డ ప‌రిస్థితులు మాత్రం అందుకు పూర్తి విరుద్దంగా ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే, ఎంపి, మంత్రులు అంతా పారిశ్రామికవేత్త‌ల‌ని దోచుకుంటున్నారని పవన్ ఆరోపించారు. కాకినాడ ఎస్ఈజెడ్ స‌మ‌స్య‌కి జ‌న‌సేన పార్టీ ఓ సామ‌ర‌స్య‌పూర్వ‌క ప‌రిష్కారం చూపుతుందన్నారు. రైతు క‌న్నీరు దేశానికి క్షేమం కాదు.. క్షామం అన్నారు. సెజ్‌ల వ‌ల్ల భూములు బంధాల్ని తెంపేస్తున్నాయని పవన్ వాపోయారు. 

Don't Miss